మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కి శనిగపూరం, బోడ తండా లో నిరసన సెగ తగిలింది. మహబూబాబాద్ పట్టణ శివారులోని 9, 10, వార్డులో ని శనిగపూరం, బోడ తండాలో ప్రజల సమస్యల తెలుసుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే నీ తండవాసులు చుట్టుముట్టారు. మా సమస్యలను పరిష్కరించాలంటూ నిలదీశారు.
గత 10 సంవత్సరాల నుండి ఏ ఒక్క సమస్య ను పరిష్కరించలేదని.. రోడ్లు ఆధ్వనంగా వున్నాయని అనేకసార్లు చేప్పినా పట్టించుకోలేదని.. గతంలో పనిచేసిన ఎమ్మెల్యే శ్రీ రాం భద్రయ్య ఆధ్వర్యంలో ఆభివృధ్ధి జరిగిందని.. ఆప్పటి నుండి ఇప్పటివరకు ఎలాంటి ఆభివృధ్ధి జరగలేదని ఆధికారపార్టీ నాయకులు అరోపించారు. ఎలక్షన్ సమయం దగ్గరకి రావడంతో గ్రామంలోకి వస్తున్నారని.. మా సమస్యలను పరిష్కరించకపోతే ఊరిలోకి రావద్దు అంటూ తండ వాసులు హెచ్చరించారు. దీంతో మీ డిమాండ్లను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే శంకర్ నాయక్ హమి ఇచ్చారు.