vastu: వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కారం దొరుకుతుంది చాలా మంది ఇళ్లల్లో సమస్యలు ఉంటు ఉంటాయి. సమస్యలు ఉన్నవాళ్లు వాస్తు ప్రకారం నడుచుకుంటే సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు ఈ రోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. మరి ఇక వాటి కోసం తెలుసుకుందాం ఆర్థిక ఇబ్బందులని ధన నష్టమని ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది అలానే తరచూ ఇంట్లో గొడవలు కూడా వస్తూ ఉంటాయి. వాస్తు దోషాలు కూడా ఉంటాయి. అయితే వీటిని పాటించడం వలన ఇలాంటి సమస్యలకు అన్నిటికి కూడా గుడ్ బాయ్ చెప్పేయొచ్చు.
నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం నెగటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే ఇంట్లో ఉప్పు లేదంటే పటిక కలిపిన నీళ్లని ఉంచండి ఇలా చేయడం వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
మట్టితో చేసిన వస్తువులతో ఇలా కూడా సమస్యలకి పరిష్కారం ని పొందొచ్చు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే మట్టి తో చేసిన కుండ లో నీళ్లు నింపి దాన్ని ఆగ్నేయం మూలన ఉంచండి ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సమస్యలేమి కూడా ఉండవు.
మీ ఇల్లు దక్షిణ దిశలో ఉంటే పంచముఖ హనుమంతుడి ఫోటోని పెట్టండి ఇది కూడా నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనెర్జీని కలిగించేలా చేస్తుంది.
హిందువులు ప్రతి ఒక్కరు కూడా తులసి మొక్కని పూజిస్తారు ఇంట్లో తులసి మొక్క ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఇది కూడా పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. తూర్పు వైపు తులసి మొక్కని ఉంచితే చక్కటి ప్రయోజనాలు అందుతాయి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఆనందంగా ఉండొచ్చు.