నేడు హైదరాబాద్ లో చికెన్, మటన్ షాప్స్ బంద్

-

మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఇవాళ (ఏప్రిల్ 21 ఆదివారం రోజు) హైదరాబాద్, నగర పరిసరప్రాంతాల్లో చికెన్, మటన్ షాపులు బంద్‌ పాటిస్తున్నాయి. ఈరోజు జైనులకు ప్రత్యేకమైన మహవీర్‌ జయంతి సందర్భంగా హైదరాబార్‌ సహా పరిసర ప్రాంతాల్లోని మాంసం విక్రయదారులు బంద్ పాటిస్తున్నారు. హైదరాబాద్‌లో జైన్‌ మతానికి చెందిన వారు ఎక్కువ సంఖ్యంలో ఉన్న విషయం తెలిసిందే.

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌  చికెన్‌, మటన్‌ దుకాణాలను మూసి ఉంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మహావీర్‌ జయంతి ఆదివారం 21 సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తమ ఆదేశాలను అతిక్రమించి విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌ రాస్ హెచ్చరించారు.

జైన్ కమ్యూనిటీకి వారు మహావీర్ జయంతిని పవిత్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో మాంసం దుకాణాలను బంద్‌ చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. ఇక సోమవారం నుంచి యథావిథిగా చికెన్‌, మటన్ విక్రయాలు కొనసాగనున్నాయి. ఇవాళ బంద్ రెండ్రోజుల ముందే ప్రకటించడంతో కొంత మంది మాంసం ప్రియులు ముందే మాంసం కొనుగోలు చేసి ఉంచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version