తెలంగాణలో నేడు మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం

-

తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది. ఇక తాజాగా మహిళా శక్తి క్యాంటీన్లకు ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టబోతోంది. సచివాలయంలో రెండు క్యాంటీన్లను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు.

రెండేళ్లలో జిల్లాకు ఐదు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మహిళా సంఘాలకు ఈ క్యాంటీన్ల నిర్వహణ అప్పగించనున్నారు. కలెక్టరేట్లు, ఆస్పత్రులు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

అయితే బెంగాల్‌లో 2018 నుంచి విజయవంతంగా కొనసాగుతున్న ‘దీదీ కీ రసోయ్’ తరహాలో మహిళా శక్తి క్యాంటీన్లను రాష్ట్రంలో నిర్వహించనున్నారు. మహిళా సంఘాలకు క్యాంటీన్ ప్రాంతాన్ని ప్రభుత్వ సంస్థలే ఉచితంగా లేదా తక్కువ అద్దెతో కేటాయించి ఒప్పందం చేసుకుంటాయని అధికారులు తెలిపారు. ఈ క్యాంటీన్లను రెండు మోడళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. సుమారు రూ.15 లక్షలతో ఒక మోడల్, రూ.25 లక్షలతో మరో మోడల్ ఉంటుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version