ఎన్నికల ముందు, ఆ తర్వాత కేసీఆర్‌ తో పొత్తులు ఉండవు – మల్లు రవి

-

ఎన్నికల ముందు, ఆ తర్వాత కేసీఆర్‌ తో పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి. హాథ్ సే హాథ్ జోడో యాత్ర పేరుతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ చాలా పెరిగింది. తెలంగాణ ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ ను విశ్వసిస్తున్నారన్నారు. రాష్ట్రంలో హంగ్ రాదు.. రాబోయే ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని వెల్లడించారు.

కాంగ్రెస్ పార్ట్ ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కూడా ఎవరితో పొత్తు పెట్టికోదు.. ఆ అవసరం కాంగ్రెస్ పార్టీ కి రాదని…. రాష్ట్రంలో బిఆర్ఎస్ తోనే కాంగ్రెస్ పార్టీ కి ప్రధాన పోటీ ఉందని వివరించారు. కార్యకర్తలు గందరగోళంలో పడే విదంగా నాయకులు మాట్లాడడం సరికాదు.. సీనియర్ నాయకులు బిఆర్ఎస్ కాంగ్రెస్ తో కలిసి పని చేస్తుందని మాట్లాడడం సరైంది కాదని తెలిపారు. ఇక్కడ కేసీఆర్ లాంటి నియంతను, ప్రజా కంఠకుణ్ణి గద్దె దింపడమే ప్రధాన లక్ష్యం గా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని వెల్లడించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ లక్ష్యం తో అయితే ఇచ్చామో ఆ లక్ష్యం నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు మల్లు రవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version