Hyderabad: విద్యుత్ స్తంభాన్ని తాకి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని దూద్‌బౌలికి చెందిన ఫక్రు(40) మంగళవారం బహదూర్‌పురాలో వరదలు ఉన్న రోడ్డు దాటుతున్నప్పుడు విద్యుత్ స్తంభానికి తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అతను మద్యం తాగి పడిపోయాడని అనుకున్న స్థానికులు పట్టించుకోలేదు, కానీ ఎంత సేపటికి కదలకపోవటంతో పోలీసులకు సమాచారం అందించగా….పోలీసులు వచ్చి చూసే సరికి ఫక్రు మృతి చెంది ఉన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో వర్షాలు పడుతున్నాయి కరెంట్ స్తంభాలతో జాగ్రత్త అంటూ అధికారులు ప్రకటించారు.