మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి ముదురుతోంది. తాజాగా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన మంచు మనోజ్.. తన ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం పై ఫిర్యాదు చేసారు. అయితే ఈ పని మనోజ్ అన్న విష్ణునే చేసారు అని వార్తలు వచ్చినా.. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం విష్ణు పేరు లేదు. అయితే నిన్న రాత్రి మంచు మోహన్ బాబు ఇంట్లో ఆయన భార్య బర్త్ డే పార్టీ జరిగింది. కానీ ఈ పార్టీ జరుగుతుండగా ఒక్క సారిగా కరెంట్ కట్ అయ్యింది.
దాంతో జనరేటర్ ను ఆన్ చేసింది మంచు కుటుంబం. కానీ ఈరోజు ఉదయం చూడగా జనరేటర్‌లో పంచదార పోసినట్లు గుర్తించారు. దీంతో కొంతమంది వ్యక్తులు తన ఇంట్లోకి చొరబడి జనరేటర్ లో పంచదార పోసారని పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేసారు మనోజ్. తనతో పాటు తన కుటుంబసభ్యులను కరెంట్ పిక్షన్ చేసి చంపాలని కుట్ర చేసినట్లు అందులో పేర్కొన్నారు. నాతో పాటుగా నా భార్య పిల్లల్ని, తల్లిని చంపే ప్రయత్నం జరిగింది అని తెలిపిన మంచు మనోజ్.. వారం రోజుల క్రితం కొంతమంది వ్యక్తులపై ఫిర్యాదు చేసాను. వాళ్లే ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి ఇలాంటి కుట్ర చేసారు అని మనోజ్ పేర్కొన్నారు.