Manda Jannadham: మందా జగన్నాథం ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమం గా ఉందని చెబుతున్నారు. నిమ్స్ లో వెంటిలేటర్ పై నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మందా జగన్నాథంకు చికిత్స అందిస్తున్నారు. గతంలో నాలుగు సార్లు ఎంపి గా పనిచేసిన మందా…ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యారు.
ఇక హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యులు మంద జగన్నాధంను పరామర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. నిమ్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ బీరప్ప ఇతర వైద్యులను అడిగి మందా జగన్నాథం ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకొని మందా జగన్నాథం కి మంచి చికిత్స అందించాలని వైద్యుల బృందానికి సూచించారు పొన్నం. నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యులు మంద జగన్నాధంను హరీష్ రావు కూడా పరామర్శించారు.