మంగలగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా.. స్పీకర్ తమ్మినేని ఏమన్నారంటే..?

-

వైసీపీ సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్ సీపీ పార్టీకి రాజీనామా చేయడం ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ సీనియర్ నేత ఆర్కే రాజీనామా వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్కే రాజీనామా పై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేశారన్న వార్త తెలిసిందని, ఓఎస్డీ ద్వారా తనకు సమాచారం అందిందని తెలిపారు. ఆర్కే ఎందుకు రాజీనామా చేశారన్న దాని గురించి నాకు తెలియదని అన్నారు.


రాజీనామాకు గల కారణాలను ఆయనతో పర్సనల్ గా మాట్లాడి తెలుసుకుంటానన్నారు. రాజీనామా లేఖ ఇచ్చినంత మాత్రాన అది రాజీనామా కింద ఆమోదించలేమని, ఆ రాజీనామా రాజ్యాంగబద్ధంగా ఉందో లేదో చూసేంతవరకు దీనిపై స్పష్టత ఇవ్వలేమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్కెకు వైసీపీలో సముచిత స్థానం ఇవ్వలేదని, అందుకే రాజీనామా చేశారని జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని ఈ వార్తలను తమ్మినేని కొట్టి పారేశారు. ఇక ఆర్కే రాజీనామాపై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version