నేడు తెలంగాణ బంద్‌కు మావోయిస్టుల పిలుపు !

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ఠ్. ఇవాళ తెలంగాణ బంద్‌ కానుందట. ఇవాళ తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ములుగు జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ కు ఇవాళ పిలుపునిచ్చినట్టు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేశారు.

Maoists call for Telangana Bandh today

పోకలమ్మ వాగు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఏడుగులు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. నేడు తెలంగాణ బంద్‌కు మావోయిస్టుల పిలుపు నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.  ఇక అటు ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై మాకు అనుమానాలు ఉన్నాయని బాంబ్‌ పేల్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఫేక్ ఎన్‌కౌంటర్లు ఎప్పటికైనా తప్పే.. గతంలో కేసీఆర్ గారు కూడా ఎన్‌కౌంటర్లకు ఒప్పుకోలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news