ఏపీ పేదలకు షాక్.. నేటి నుంచి పింఛన్ల తనిఖీలు ఉండనుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి రెండు రోజులు పాటు పింఛన్ల తనిఖీలు చేయనున్నారు అధికారులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ పెన్షన్ దారులను ఏరివేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధమైంది చంద్రబాబు నాయుడు సర్కార్.
ఇందులో భాగంగానే… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి రెండు రోజులు పాటు పింఛన్ల తనిఖీలు చేయనున్నారు అధికారులు. ఇక తొలి విడతలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు వివరాలు సేకరణ ఉంటుంది. ఇందుకోసం పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమాకం చేశారు. ఒక్కో బృందం 40 పింఛన్లను పరిశీలన చేస్తారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.