బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలుగా మరోసారి మాయావతి ఎన్నిక

-

బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా 68 సంవత్సరాల మాయావతి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవలే మాయావతి ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఆమె వీటిని కొట్టి పారేసింది.

తాజాగా జాతీయ అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం విశేషం. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ దళితులు, ఆదివాసుల అభ్యన్నతి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. బహుజనుల ఆత్మగౌరవం, డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ ప్రారంభించిన ఉద్యమం ఊపందుకుంటుందని.. దాని లక్ష్యం నుంచి మళ్లించలేని విధంగా బలంగా మారిందన్నారు. ఎన్నికల్లో ప్రతికూల పరిణామాలు ఎదురైనప్పటికీ, బీఎస్పీ నిరాశ చెందలేదన్నారు. దోపిడికీ గురవుతున్న పీడిత ప్రజలందరి తరపున పోరాటానికి సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు దేశంలోని మైనార్టీలు, వెనుకబడిన వర్గాల నిజమైన శ్రేయాభిలాషులు కాదని విమర్శించారు మాయావతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version