మేఘాతో 3 ఒప్పందాలు.. తెలంగాణలో రూ.11 వేల కోట్లు పెట్టుబడులు!

-

తెలంగాణ ప్రభుత్వంతో మేఘా ఇంజనీరింగ్ (MEIL) కంపెనీ మూడు కీలక ఒప్పందాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్ ఏర్పాటుకు పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేసుకున్నారు.

megha

దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో మెఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ కంపెనీ కృష్ణారెడ్డి ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ప్రాజెక్టుపై దాదాపు రూ.11 వేల కోట్లు పెట్టుబడులు తెలంగాణకు వస్తాయి. నిర్మాణ దశలో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయి.

అటు దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం జరిగింది. యూనిలీవర్ కంపెనీ గ్లోబల్ CEO తో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు సఫలం య్యాయి. తెలంగాణలో పెట్టుబడులకు సానుకూలత వ్యక్తం చేసింది ప్రముఖ వినియోగ వస్తువుల తయారీ బ్రాండ్ యూనిలీవర్.
తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది యూనిలీవర్ సంస్థ. కామారెడ్డి జిల్లాలో తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపింది. తెలంగాణలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను సైతం ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సంస్థ… కీలక ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news