12 మెట్ల కిన్నెరను వాయించిన మంత్రి దామోదర రాజనర్సింహ

-

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎస్సీ వర్గీకరణ నిర్ణయంపై  ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ప్రతినిధులు స్వాగతించారు. ఎస్సీ వర్గీకరణ తీర్మానం ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టినందుకు ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాల ప్రతినిధులు శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ని హైదరాబాదులో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: మంత్రి దామోదర్ రాజనర్సింహ చేసిన
కృషి ని డక్కలి కళాకారుడు పోచప్ప పాటగా మలిచి మంత్రికి వినిపించారు. ఈ సందర్భంగా డక్కలి
పోచప్పా 12 మెట్ల కిన్నెరను మంత్రి పరిశీలించారు. పాచప్ప అభ్యర్థన మేరకు 12 మెట్ల కిన్నెరను మంత్రి దామోదర్ రాజనర్సింహ వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ 57
ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం, బత్తుల పాండు,
కోల్పుల నవీన్, వెంకటేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news