అధికారం పోగానే కేసీఆర్‌ పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు: కోమటిరెడ్డి

-

బీఆర్ఎస్ (అప్పడు టీఆర్ఎస్) వస్తే తొలి సీఎం దళితుడని నాడు కేసీఆర్‌ చెప్పారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. దళితుడిని సీఎం చేయకపోతే మెడపై తల ఉండదని గొప్పలు చెప్పారని, పరిపాలన అనుభవం ఉండాలని తొలిసారి కేసీఆర్‌ సీఎంగా ఉండాలన్నారని గుర్తు చేశారు. రెండోసారి బీఆర్ఎస్ వచ్చినా దళితుడిని సీఎం చేయలేదని మండిపడ్డారు. అధికారం పోగానే కేసీఆర్‌ పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్పై తీవ్రంగా ఫైర్ అయ్యారు.

‘కనీస పరిజ్ఞానం లేకుండా పాలించి కొత్త నాటకాలాడుతున్నారు. అగ్గిపెట్టె నాటకాల పేరుతో పిల్లలను బలితీసుకున్నారు. కేసీఆర్‌ చేసిన దొంగ దీక్షలతో 50 ఏళ్లయినా బతకవచ్చు. సోనియా దేవత.. ఆమె లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని కేసీఆర్‌ చెప్పారు. అధికారం లేకపోయేసరికి కేసీఆర్‌ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. దొంగ రాజీనామా లేఖలను ఎందుకు ఇస్తున్నారు? హామీలు అమలు చేయకపోతే ప్రజలను క్షమాపణ కోరి ఉండేవాళ్లం. గతంలో నేను మంత్రి పదవి వదులుకున్నా.. పదవులు శాశ్వతమా? రైతులపై ప్రేమ ఉంటే రాజీనామా లేఖ స్పీకర్‌కు ఇవ్వాలి. కమీషన్ల కోసం రూ.7 లక్షల కోట్లు అప్పులు చేశారు. మూసీకి రూ.5 వేల కోట్లు ఇప్పించాలని కిషన్‌రెడ్డిని కోరాను. మూసీని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషిచేస్తున్నాం.’ అని కోమటిరెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version