జన్వాడ ఫామ్ హౌజ్ కేటీఆర్ దే.. మీడియాను నేనే తీసుకు వెళ్తా..!

-

కేటీఆర్ జన్వాడలో ఫామ్ హౌజ్ కట్టుకున్నారు. నేను కేటీఆర్ ఫామ్ హౌజ్ చూసి వచ్చా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నాడు పీసీసీ అధ్యక్షుడు వెళ్లి డ్రోన్ ఎగిరిస్తే కేసు పెట్టారు. అయితే పొంగులేటి ఫామ్ హౌజ్ FTL పరిధిలో ఉందనే విషయం నాకు తెలియదు. పొంగులేటి వుండేది హైదరాబాద్ లో.. ఆయనకు సిటీలో ఇల్లు ఉంది. అయితే కేటీఆర్ ఫామ్ హౌజ్ కు వెళ్ళినప్పుడు ఆయన భార్య అక్కడ పని చేయిస్తుంది. ఆ జన్వాడ ఫామ్ హౌజ్ కేటీఆర్ దే.. మీడియా వస్తా అంటే నేనే తీసుకు వెళ్తా అని అన్నారు.

హైడ్రా ఒక మంచి ఆలోచనతో ఏర్పాటు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సినిమా వాళ్ల ఇండ్లు, రాజకీయ నాయకుల ఫామ్ హౌజ్ లు, అందరివి తొలగిస్తాం. మేము తెలంగాణ కోసం ఉద్యమం చేసాం. అయితే కేసీఆర్ లాగా హాస్పిటల్ లో ఉద్యమం చేయలేదు. రోడ్ల మీద ఉద్యమం చేసాం అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version