సీఐ కుర్చీలో మంత్రి కొండా సురేఖ…RSP కౌంటర్

-

Minister Konda Surekha confronts police officials, sparks another controversy: మంత్రి కొండ సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి కొండ సురేఖ రాకతో గీసుగొండ పోలీస్ స్టేషన్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివారం రోజున ఈ సంఘటన జరిగింది. సీఐ కుర్చీలో కూర్చున్న మంత్రి కొండా సురేఖ..పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చారట. దీంతో పోలీస్ స్టేషన్‌కి భారీగా చేరుకున్నారు కొండ సురేఖ వర్గీయులు.. తన వర్గం కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారని ఆరాతీశారు మంత్రి సురేఖ.

 

Minister Konda Surekha confronts police officials, sparks another controversy

మంత్రి కొండా సురేఖ, రేవూరి ప్రకాష్ రెడ్డి కార్యకర్తల మధ్య జరిగిన వివాదంపై ఆరా తీశారు. ఈ తరుణంలోనే సీఐ కుర్చీలో కూర్చున్న మంత్రి కొండా సురేఖ..పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చారట. దీనిపై బీఆర్‌ఎస్‌ కీలక నేత ఆర్ఎస్‌ ప్రవీణ్‌ స్పందించారు. శ్రీమతి కొండా సురేఖ గారు, ఐపీయస్ అంటూ సెటైర్లు పేల్చారు. కాంగీయుల పాలనలో చిత్ర విచిత్రాలు, నమ్మలేని నిజాలు…మంత్రి గారు అనుచరుల కోసం పోలీసు స్టేషన్ కు పోవడమా..మరి ఇదే పని చేసిన మా ఆదివాసి ఆణిముత్యం శ్రీమతి కోవ లక్ష్మి ఎమ్మెల్యే గారి మీద కేసు ఎట్ల పెట్టిండ్రు, డీజీపీ గారు? అంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version