ఇవాళ్టి నుంచి పల్లె పండుగ వారోత్సవాలు..ఏకంగా 13,324 గ్రామాల్లో

-

AP Deputy CM Pawan Kalyan Palle Panduga: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి పల్లె పండుగ వారోత్సవాలు జరుగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 13,324 గ్రామాల్లో ఒకేసారి ప్రారంభంకానున్నాయి పల్లె పండుగ వారోత్సవాలు.

AP Deputy CM Pawan Kalyan Palle Panduga

ఈ తరుణంలోనే కంకిపాడులో జరిగే పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొననున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. దాదాపు రూ. 4,500 కోట్ల వ్యయంతో 30 వేల పనులను చేపట్టనున్న ప్రభుత్వం… ఇవాళ్టి నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించనుంది.

ఇక అటు  ఇవాళ మద్యం దుకాణాలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ ఏపీలోని మద్యం దుకాణాలకు లాటరీ ప్రాసెస్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3396 వైన్స్ కు దుకాణాలకు.. లాటరీ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ 3396 మద్యం దుకాణాలకు… దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చినట్లు తాజాగా ఎక్సైజ్ శాఖ.. ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version