ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని గతంలో BRS నేతలు ఫిర్యాదులు చేశారు. గతంలో 99 కోట్ల రూపాయలు టెండర్ లు లేకుండా ఖర్చు చేశారు. 103 BRS నేతల బంధువుల భవనాలు గురుకులాలకు కిరాయికి ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళ అనుచరగనం లక్షల రూపాయ గతంలో వసూలు చేశారు. దళిత ఓటర్ లను తన వైపుకు తిప్పుకోవడానికి BSPలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయిన్ అయ్యారు.
కానీ ఎన్నికలు అయ్యాక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ BRS లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు జరుగుతున్న ఫుడ్ పాయిజన్ వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉంది. ఆయన అనుచరగనం ఉన్నారు. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మాఫీయా నడిపాడు. మా పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న పెయిడ్ సోషల్ మీడియా వాళ్లకు భార్యలు తల్లులు లేరా. పరిమితికి మించి ప్రభుత్వం పై కామెంట్స్ చేస్తున్నారు అని కొండా సురేఖ అన్నారు.