తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రి కొండ సురేఖ మరో వివాదంలో ఇరుక్కున్నారు. తన ఇంట్లో బీరు పార్టీ చేసుకుంటూ దొరికిపోయారు. తాజాగా కొండా సురేఖ కూతురు బర్త్డే అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమె ఇంట్లో బీరు అలాగే బిర్యానీ పార్టీ జరిగిందని సమాచారం. ఈ తరుణంలోని… కొండా సురేఖకు సన్నిహితురాలు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖతో ఆమె వీడియో కాల్ మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా బీరు అలాగే బిర్యానీ పార్టీల గురించి మాట్లాడుకున్నారు. అయితే ఈ వీడియోని ఎవరో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. దీంతో కొండా సురేఖ పై నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి… ఇలా బీరు బిర్యానీ పార్టీ చేసుకోవడం ఏంటని ఆగ్రహిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున అలాగే సమంత వివాదంలో ఇరుక్కున్న కొండా సురేఖ… ఇప్పుడు ఈ బీరు బిర్యానీ పార్టీలో.. బుక్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.