గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి ..!

-

గిరిజనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారీ శుభవార్త చెప్పారు. త్వరలోనే అర్హులైన గిరిజనులకు పోడు భూములు పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. సోమవారం భద్రాచలంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల స్కీము ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమం అని అన్నారు. భద్రాది రాముడి సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తున్నాం.. పేదల సొంతింటి కలను సాకారం చేస్తామనన్నారు.

మా ప్రభుత్వానికి భద్రాద్రి రాముడి ఆశీస్సులు ఉన్నాయన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు. డబుల్ ఇండ్ల పేరుతో కేసీఆర్ పేదలను మోసం చేశారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. భద్రాది రాముడిని కూడా కేసీఆర్ మోసం చేశారని విమర్శలు గుప్పించారు. భద్రాద్రికి రూ. 100 కోట్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద పార్టీలకు అతీతంగా ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version