TSను TGగా మార్చడానికి అసలు కారణమిదే

-

నిన్న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ రాష్ట్ర కేబినెట్. ముఖ్యంగా ts ను tg గా మార్చాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది అయితే దీనిపై పొంగులేటి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు టీజీ అనే అప్రూవల్ ఇచ్చిందని తెలిపారు.

minister ponguleti srinivas reddy gave clarity

దానిని గత ప్రభుత్వం టిఎస్ గా మార్పు చేసిందని వివరించారు. తెలంగాణ టీజీ గానే ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మిగతా నాలుగు గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు తో పాటు మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ జీవన్ రెడ్డి, శ్రీ దామోదర రాజనర్సింహ,ఎమ్మెల్యేలు శ్రీ సుదర్శన్ రెడ్డి, శ్రీ రోహిత్ రావు, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఏ. చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈనెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version