Telangana: సూర్యాపేట 5వ తరగతి విద్యార్ధి మృతి..రూ. 2 లక్షల ప్రకటన, ఉద్యోగం !

-

Telangana: సూర్యపేటలో 5వ తరగతి విద్యార్ధి మృతి నేపథ్యంలో..రూ. 2 లక్షల ప్రకటన చేసింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. సూర్యాపేట జిల్లా, పెన్ పాడ్ మండలం, దోసాపాడు గ్రామంలో ఉన్న మహాత్మాజ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్ధిని సరస్వతి ఆకాల మరణం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతిని వ్యక్తం చేశారు. సరస్వతి మరణం పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Chief Minister Revanth reddy to Launch Safety Kits for Toddy Tappers

వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.సరస్వతి మృతికి గల కారణాలపై విచారణ జరపాలని గురుకుల సెక్రటరీ సైదులుని ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి సరస్వతి కుటుంబానికి తక్షణ సాయంగా కింద రూ. 2 లక్షల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. వారి ఇంట్లో ఒకరికి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ (MJPBCREIS)లో ఉద్యోగాన్ని కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇచ్చారు. సరస్వతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా… సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దోసపహాడ్‌లోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదివే విద్యార్థిని హాస్టల్‌లో అనుమానాస్పదంగా మృతి చెందింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version