ఉప్ప‌ల్‌లో కుంగిన జాతీయ ర‌హ‌దారి.. గుంత‌లో దిగ‌బ‌డిన కారు..!

-

ఉప్ప‌ల్‌లో ఉన్న‌ట్టుండి రోడ్డు కుంగిపోయింది. దీంతో ఓ కారు ఆ గుంత‌లో దిగ‌బ‌డింది. మిగ‌తా వాహ‌న‌దారులు అప్ర‌మ‌త్త‌మై త‌మ వాహ‌నాల‌ను ఆపేశారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ – వ‌రంగ‌ల్ జాతీయ ర‌హ‌దారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. హైద‌రాబాద్ – వ‌రంగ‌ల్ హైవేపై నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పిల్ల‌ర్ల వ‌ద్ద రోడ్డు కుంగిన‌ట్లు పోలీసులు తెలిపారు. భారీ వ‌ర్షం కార‌ణంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తేల్చారు. రోడ్డు కుంగిపోవ‌డంతో ప్ర‌యాణికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు. ఇక ఆ గుంత‌ను పూడ్చేందుకు పోలీసులు, అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఇక కారులో ఉన్న‌వారికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కేవ‌లం కారు ముందు టైర్లు మాత్ర‌మే గుంత‌లో దిగ‌బ‌డ్డాయి. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version