BRS, BJP, MIM కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కుట్రలు – పొన్నం

-

BRS, BJP, MIM కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… BRS, BJP, MIM మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపణలు చేశారు.

Minister Ponnam Prabhakar morning walk in Siddipet

110 సీట్లలో డిపాజిట్లు రాని బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. కడియం శ్రీహరి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడువదు అంటున్నారన్నారు….బుద్ధి,జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడవచ్చా..? అని ఫైర్‌ అయ్యారు. ప్రజలు తీర్పు ఇచ్చారు..ప్రభుత్వం మారింది..మీ తీరు కూడా మార్చుకోండన్నారు. రాజాసింగ్ ఏమైనా జోతిష్యం చదివాడా.. 10 మంది ఎమ్మెల్యేలు పోతారు అంటున్నారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version