ప్రతి నెల ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే : శ్రీధర్ బాబు

-

పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం 39 వ్యవస్థాపన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక కామెంట్స్ చేసారు. తెలుగు భాషా, మన రాష్ట్ర నైపుణ్యం ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా కృషి చేసిన మహనీయులకు ధన్యవాదాలు. పద్మ భషణ్ డాక్టర్ వరప్రాద్ రెడ్డికి విశిష్ట పురస్కారం ప్రదానం సంతోషకరం. ఓ ప్రక్కన గత డిసెంబర్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తెలుగు భాషా విద్యార్థులు చిత్ర లేఖనం, వారి నైపుణ్యం అమెరికాలో, మలేషియాలో కూడా అనునిత్యాన్ని చాటి చెప్తున్నారు.

మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో విశవ్య విద్యాలయం స్తాపించబడింది. ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచన చేయాలి. ప్రతి నెల ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ఇతర కార్పొరేషన్ రంగాల్లో కాంపిట్యూటివ్ పరీక్షలు నిర్వించి కాళీలు భర్తీ చేస్తున్నాం. పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు అవకాశం కల్పించాలి అనే ప్రభుత్వ ఆరాటం. రాబోయే కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నాం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మాది. 100 కంప్యూటర్ లు అతి త్వరలో కేటాయిస్తాం. ఆర్టిఫిషియల్ రంగంలో యువ విద్యార్థులు నైపుణ్యం పెంపొందించే దిశగా ముందుకు పోవాలి అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version