తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 30 వేల ఐటీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు మంత్రిశ్రీధర్ బాబు ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించనున్నట్లు…. ఆయన తాజాగా వెల్లడించారు. ఇందుకోసం గాను అమెరికాకు చెందిన ఐటీ సర్వ్ అలియాన్స్… తో భారీ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటన చేశారు మంత్రి శ్రీధర్ బాబు.
తొలి విడతలో కరీంనగర్ జిల్లా, మహబూబ్నగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ఈ పరిశ్రమ విస్తరించనున్నట్లు వివరించారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఇక ఈ కంపెనీ… ఆయా జిల్లాలో ఉన్న స్థానిక నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి 30000 ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యమని… ప్రకటన చేయడం జరిగింది. ఇలా జిల్లా స్థాయిలో కూడా ఉపాధి పెరుగుతుందని వివరించారు.