తెలంగాణను ఆగం చేయాలని కేంద్రం భావిస్తుంది – మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అదనంగా నిధులు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పాలమూరు ప్రాజెక్ట్ నిధులు ఇస్తామని చెప్పిన ప్రధాని మోడీ ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. ఇక మంత్రి గంగుల కమలాకర్, మల్లా రెడ్డి, తలసాని మీద ఈడీ దాడులు జరుగుతున్నాయని.. మీరు ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో వున్నారు కదా మరి అక్కడ అవినీతి మీకు కనిపిస్తలేదా? అని ప్రశ్నించారు.

ఈడీ అనే సంస్థ బీజేపీ కి అనుబంధంగా పని చేస్తుందని ఆరోపించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ మీద కక్ష్య తో ఈడీ దాడులు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రశాంతంగా ఉంది కాబట్టే వేల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని.. తెలంగాణ ను ఆగం చేయాలని కేంద్రం భావిస్తుందని మండిపడ్డారు.

బిజెపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిందని.. దీనికి మా వద్ద ఆధారాలు ఉన్నాయి, విచారణ కూడా జరుగుతుందన్నారు. ఇక దాడులకు ప్రతీ దాడులు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు భయపడరని అన్నారు. దేశంలో మత పిచ్చి తో అభివృద్ధి చేయకుండా దేశాన్ని ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version