ఈ ఆయుర్వేద చిట్కాలతో మలబద్ధకం, అజీర్తి దూరం..!

-

ఎక్కువ మంది మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలని ఎదుర్కొంటూ వుంటారు. ఈ సమస్యల నుండి బయట పడడానికి కొన్ని ఇంటి చిట్కాలు మీకు బాగా ఉపయోగ పడతాయి అయితే మరి ఎలా ఈ సమస్యల నుంచి దూరంగా ఎలా ఉండాలి..? ఈ సమస్యలు రాకూడదంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.

ఈ చిట్కాలని అనుసరించి సమస్యల నుండి బయటపడొచ్చు. నిజానికి మనం తీసుకునే ఆహారం జీవన శైలిని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. ఒక్కొక్కసారి మలబద్ధకం, అజీర్తి, యాసిడ్ రిఫ్లెక్స్ వంటివి వస్తూ ఉంటాయి అటువంటప్పుడు ఈ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వండి.

మజ్జిగ:

మజ్జిగ తీసుకోవడం వలన ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది ఇది కడుపులో ఉండే ఆమ్లాలను తొలగిస్తూ ఉంటుంది. దీనితో ఎసిడిటీ సమస్యని దూరం చేసుకోవచ్చు.

తులసి ఆకులు:

తులసి ఆకులు కూడా చక్కటి రిలీఫ్ ని ఇస్తాయి. ఏదైనా కడుపులో ఇబ్బంది ఉంటే తులసి ఆకులని నమలండి. దానితో సమస్యకు చెక్ పెట్టడానికి అవుతుంది.

గోరువెచ్చని నీళ్లు:

గోరువెచ్చని నీళ్లు తాగితే కూడా కడుపు బాగుంటుంది. యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యల్ని ఇది దూరం చేస్తుంది.

బెల్లం:

బెల్లం కూడా ఈ సమస్యను తొలగిస్తుంది జీర్ణక్రియను పెంచడానికి బెల్లం ఉపయోగపడుతుంది. ఆసిడ్ రిఫ్లెక్స్, ఉబ్బరం వంటి సమస్యలు దూరం అవుతాయి.

సోంపు:

ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది సోంపు ద్వారా మనం ఈ సమస్యలకి పరిష్కారం పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version