రైతులు తెచ్చే ప్రతి గింజను కొనుగోలు చేస్తాం : మంత్రి తుమ్మల

-

యాదాద్రి జిల్లా.. రామన్నపేట ను కొత్త మార్కెట్ గా పునరుద్ధరణ చేస్తాం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. BRS ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే ఏ పథకాన్ని అమలు చేయలేదు. అందువల్ల సహకార సంఘాలు కోట్ల రూపాయలు నష్టపోయాయి. చేనేతకు పెండింగులో ఉన్న నిధులను త్వరలోనే మంజూరు చేస్తాం. చేనేత ద్వారా తెలంగాణ లో ఉన్న ప్రతి మహిళలకు చీరలు ఇస్తాం. చేనేత వృత్తి మీద బ్రతికే కుటుంబాల కోసం వాళ్ళ అప్పులను కూడా ప్రభుత్వం మాఫీ చేస్తది.

ఇక వడ్ల కొనుగోలులో మిల్లర్స్ తో మాట్లాడి వాళ్లకు మిల్లింగ్ చార్జీలు పెంచాం. రైతులు తేమ లేకుండా ధాన్యం, పత్తిని తీసుకురావాలి. వారు ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి తుమ్మల. ఇక ఇప్పటి వరకు 22 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేశాం. రాష్టంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలోనే ఎక్కువ రుణమాఫీ జరిగింది. దేశంలో ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం లొనే రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. పెండింగులో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, డిసెంబర్ 9 లోపు పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తా అని పేర్కొన్నారు మంత్రి తుమ్మల.

Read more RELATED
Recommended to you

Exit mobile version