వర్రా రవీంద్ర రెడ్డి సోషల్ మీడియా వర్కరా లేక అంతర్జాతీయ తీవ్రవాదా. ప్రభుత్వాన్ని ప్రశ్నించేతత్వం తో సోషల్ మీడియా లో పోస్టులు పెట్టాడు వర్రా. పోస్టులు హద్దు దాటి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం వ్యక్తిగతంగా తీసుకొని అరెస్టులు చేస్తున్నారు అని వైస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లపై అఘాయిత్యాలు జరుగుతుంటే పెట్టించుకొని ప్రభుత్వం.. టీడీపీ నేతల ఆడపిల్లలు అయిన, ఏ ఆడపిల్లలకు అయిన అన్యాయం జరిగితే స్పందించాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉంది.
ఒక చిన్న సోషల్ మీడియా వర్కర్ కోసం డిజిపి జోక్యం చేసుకుని ఒక ఎస్పీ, ఒక సిఐ సస్పెండ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వర్కర్లను అరెస్టు లు చేసి ఇబ్బంది పెడుతున్నారు. వర్రా ప్రాణానికి ప్రమాదం ఉందని టీడీపీ నేత బిటెక్ రవి చెప్పడం ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే వర్రాకు టీడీపీ నేతల వల్ల ప్రాణహాని ఉందనిపిస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదు. సోషల్ మీడియాలో ప్రశ్నించాలంటే భాదపడుతున్నారు. న్యాయమూర్తులకు అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్న ప్రజల స్వేచ్ఛను కాపాడండి అని శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.