తెలంగాణ జలాలను సైతం ఏపీకి ఇస్తున్నారని జగన్‌ చెప్పారు: ఉత్తమ్‌

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో ఆ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. అనంతరం సభలో తీర్మానం ప్రవేశపెట్టిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన జల దోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు.

‘‘ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్‌పైకి పోలీసులను పంపింది. రోజుకు 3 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయింది. కేసీఆర్‌ ఓడిపోబోతున్నారనే సాగర్‌పైకి జగన్‌ పోలీసులను పంపినట్లు అనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ షరతులకు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదు. రాష్ట్ర ప్రజలకు అపోహలు కలిగేలా కొందరు మాట్లాడుతున్నారు. జగన్‌, కేసీఆర్‌ గంటలతరబడి మాట్లాడుకున్నారు..కలిసి బిర్యానీలు తిన్నారు. కేసీఆర్‌ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్‌ పొగిడారు. తెలంగాణ జలాలను సైతం ఇస్తున్నారని చెప్పారు.” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version