ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే : మంత్రి అంబటి ప్రకటన

-

ఏపీ రాజధానిపై మంత్రి అంబటి రాంబాబు కీలక వాక్యాలు చేశారు. ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే అని తెలిపారు. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీకి మూడు రాజధానులు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లది అనైతిక పొత్తు అని రాంబాబు విమర్శించారు. ప్రత్యర్థుల్లో గందరగోళ పరిస్థితి తలెత్తిందని….జనసేన పొత్తు….బీజేపీతోనా? టీడీపీతోనా? అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు.

At present the capital of AP is Amaravate said Minister Ambati’s announcement

జగన్ మోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపి స్థానాన్ని బీసీకి కేటాయించారని లావు శ్రీ కృష్ణ దేవరాయలు పార్టీ విడిచి వెళ్ళిపోయారని తెలిపారు. బీసీ లకు సీటు ఇస్తే తట్టుకోలేక ఇంకో పార్టీ లోకి వెళ్తున్న లావు ఒక బీసీ ద్రోహి అన్నారు. పార్టీ అసంతృప్తులు సరి చేసుకొని ముందుకు వెళ్తామని వివరించారు మంత్రి అంబటి రాంబాబు. ప్రస్తుతానికి ఏపీ కి రాజధాని అమరావతేనని… కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version