ఈ నెల 29న మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు

-

సాగునీటి శాఖ, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ నెల 29న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు లు మేడి గడ్డ ప్రాజెక్టు సందర్శన ఉండనుంది. ఆ రోజున ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మంత్రులు మెడిగడ్డ బయలుదేరుతారు..మెడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారని ఈ మేరకు సాగునీటి శాఖ, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు.

Ministers Uttam and Sridhar Babu will visit Medigadda on 29th of this month

ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ, నష్టాలు..కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం.. కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలు..ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్ పై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే.. మేడిగడ్డ, సిందిళ్ళ, అన్నారం బ్యారేజ్ ల సమస్యలు, వాటి పరిష్కారాలు..తదితర అంశాలపై సమీక్ష చేయనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై పవర్ పాయింట్ ప్రాజెక్టు అనంతరం మెడిగడ్డ, అన్నారం బ్యారేజ్ లను సందర్శించి పరిశీలన చేయడం జరుగుతుందని.. ఈ పర్యటన కు సంబంధించి నిర్మాణ సంస్థలకు సబ్ కాంట్రాక్టర్లలకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారికి అందరికి సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకోగలరని ఈ.ఎన్. సి ని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సమీక్షను పర్యటనను కవర్ చేయడానికి మీడియాకు అవసరమైన ఏర్పాట్లు చేయగలరని. సమాచార పౌర సంబంధాల శాఖకు తగిన సమాచారం ఇవ్వాలని మంత్రి ఉత్తమ్‌ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version