వికారాబాద్ జిల్లా తాండూర్ లో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలిక పై మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. తాండూర్ అయ్యప్ప నగర్ లో ఉండే మైనర్ బాలిక పై ఓ మైనర్ బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలుడు స్థానిక గుడిలోని పూజారి అల్లుడు కావడంతో… గుళ్లో కొబ్బరికాయలు ఇప్పిస్తానని నమ్మించి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడని సమాచారం.
బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో.. పేరెంట్స్ కు తెలియజేసింది. ఈ తరుణంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాలిక తండ్రి వెంకటయ్య. దీంతో కలగజేసుకున్న స్థానిక రాజకీయ నేతలు.. విషయం బయటకు పొక్కకుండా ఉంచి.. పంచాయతీ పెట్టారు. బాలిక కుటుంబానికి 50 వేల రూపాయలు ఇచ్చి నోరు మూపించే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం జరగాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాలిక తల్లిదండ్రులు…మీడియాకు విషయం చెప్పారు. ఇక దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.