మిషన్ కాకతీయను కమిషన్ల కాకతీయగా మార్చారు – డీకే అరుణ

-

బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బిజెపి జాతీయ నేత డీకే అరుణ. ఆదివారం నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం మోతె లో వరద బాధితులను పరామర్శించారు. రైతులతో మాట్లాడి నష్టం గురించి ఆరా తీశారు డీకే అరుణ. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చెరువుల అభివృద్ధి పనులను నాసీరకంగా చేపట్టి అధికార పార్టీ నేతలు కమిషన్లు వెనకేసుకున్నారని ఆరోపించారు.

అందువల్లే చెరువులకు గండ్లు పడ్డాయని.. మిషన్ కాకతీయను కమిషన్ల కాకతీయగా మార్చారని మండిపడ్డారు. వరద బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ రైతుల బాధలను పట్టించుకోవడం లేదని అన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గంలో నాణ్యత పాటించనందువల్లే చెరువులకు గండ్లు పడ్డాయని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version