అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్‌ విస్తరణ: రాజగోపాల్‌రెడ్డి

-

అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్‌ విస్తరణ ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. తనకు కాంగ్రెస్‌ అధిష్ఠానం హామీ ఇచ్చిందని తెలిపారు. తనకు హోంశాఖ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తను కాంగ్రెస్‌లోకి వచ్చిందే కేసీఆర్‌ను గద్దె దించేందుకు అని చెప్పారు. తను హోంమంత్రి అయితేనే వాళ్లు నియంత్రణలో ఉంటారని వెల్లడించారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని, కేసీఆర్‌కు బీజేపీయే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీ శ్‌రావు, సంతోశ్‌ రావు జైలుకెళ్లడం ఖాయమని రాజగోపాల్‌ రెడ్డి అన్నారు.

అంతకుముందు అసెంబ్లీ లాబీలో కేటీఆర్, రాజగోపాల్‌రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్‌ను కేటీఆర్ అడిగ్గా.. మీలాగే మాకూ ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందని రాజగోపాల్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఫ్యామిలీ పాలన కాదు.. బాగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ అన్నారు. ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా.. సంకీర్త్ పోటీ చేస్తారా అని రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించగా.. దయచేసి తనను వివాదాల్లోకి లాగవద్దని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version