తాను హోం మంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్ లో ఉంటారు : రాజగోపాల్ రెడ్డి

-

తాను హోంమంత్రిని అయితేనే బీఆర్ఎస్ నాయకులు కంట్రోల్ లో ఉంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందన్నారు. తనకు మంత్రి పదవీ ఇచ్చేందుకు అధిష్టానం హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అయితే తనకు హోం శాఖ ఇవ్వాలని అడుగుతున్నానన్నారు.

తాను మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చేందే కేసీఆర్ ను గద్దె దించేందుకు అన్నారు. తాను హోంమంత్రిని అయితేనే వాళ్లు కంట్రోల్ లో ఉంటారన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యులందరూ జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కి బీజేపీయే శ్రీరామ రక్ష అన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని జోస్యం చెప్పారు. భువనగిరి, నల్గొండ పార్లమెంట్ స్థానాలకు తమ కుటుంబ సభ్యులు ఎవ్వరూ పోటీ చేయకూడదన్నది తమ ఉద్దేశమన్నారు. అయితే పార్టీ ఆదేశిస్తే.. పోటీ చేస్తామని, టికెట్ ఎవ్వరికీ ఇచ్చినా గెలిపిస్తామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version