మరో వివాదంలో ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి

-

ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తరచూ తన మాటలు, ప్రవర్తనతో వార్తల్లోకి ఎక్కుతుంటారు. వివాదాలు తరచూ ఆయణ్ను చుట్టుముడతాయనడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటున్న తరుణంలో కౌశిక్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కొన్ని రోజుల కిందట రైతు దినోత్సవం రోజున రైతుని తిట్టిన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అది మరవకముందే తాజాగా హుజూరాబాద్‌లో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కెమెరామెన్‌ను రాయలేని విధంగా ఎమ్మెల్సీ తిడుతున్న ఆడియో వైరల్‌ అయింది.

బాధితుడు అజయ్‌ తనకు కౌశిక్‌రెడ్డితో ప్రాణహాని ఉందని మధ్యాహ్నం సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేశారు. ‘‘నేను గురువారం హుజూరాబాద్‌లో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లా. అక్కడ ఓ మహిళ ఎమ్మెల్సీని ఏదో సమస్యపై అడుగుతున్నారు. నేను అటువైపు వీడియో తీస్తుండగా కౌశిక్‌ అనుచరులు వీడియో తీసే సెల్‌ఫోన్‌ లాక్కెళ్లిపోయారు. అది తెచ్చుకోడానికి ఎమ్మెల్సీ కార్యాలయానికి వెళ్లగా ఎమ్మెల్సీ దుర్భాషలాడుతూ… దాడి చేశారు. కులం పేరుతో దూషించారు’ అని అజయ్‌ వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version