దిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కింగ్ పిన్.. కస్టడీ పిటిషన్‌లో వెల్లడించిన ఈడీ

-

దిల్లీ లిక్కర్ కేసులోని ప్రధాన కుట్రదారుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒకరు అని, ఆమే కింగ్ పిన్ అని ఈడీ కస్టడీ పిటిషన్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల లంచం ఇవ్వడమే కాకుండా 192.8 కోట్లను కవిత అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడించింది. ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దిల్లీలోని రౌజ్‌ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈడీ పలు విషయాలను వెల్లడించింది. సౌత్ గ్రూప్‌నకు చెందిన కవిత , శరత్ రెడ్డి, మాగంటి శ్రీనివాస రెడ్డి, రాఘవ తదితరులు ఆప్ నేతలు కలిసి కుట్రపడ్డారన్నారని వివరించారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, అప్పటి ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాతో కవిత బృందం ఒప్పందం కుదుర్చుకుందని… ఆప్‌ నేతలకు లంచం ఇచ్చినందున కవితకు అనుకూలంగా మద్యం విధానం రూపొందిందని ఈడీ తెలిపింది.

“అలాగే కవిత బినామీ అరుణ్‌ రామచంద్రపిళ్లైకి ఇండోస్పిరిట్‌లో ఎలాంటి పెట్టుబడి లేకుండానే భాగస్వామ్యంతోపాటు మద్యం ఉత్పత్తిలో దేశంలోనే పేరొందిన పెర్నాడ్‌రికార్డ్‌ సంస్థలో డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారం దక్కింది. ఈ క్రమంలోనే 2021-22 దిల్లీ మద్యం పాలసీలో ఎల్‌1గా నిలిచిన ఇండోస్పిరిట్‌కు అత్యధిక లాభాలు దక్కాయి. మద్యం పాలసీలో హోల్‌సేలర్లకు లాభాలవాటాను 12 శాతానికి పెంచడం ద్వారా సౌత్‌ గ్రూప్‌నకు లబ్ధి చేకూరడమే కాకుండా వాటిల్లో నుంచే ఆప్‌ నేతలకు అక్రమ నిధులు అందేలా కుట్ర జరిగింది. కవిత మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణకు రావడంతో అరెస్ట్‌ చేశాం.” అని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version