హిమాచల్‌లో పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం

-

హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి తయారీ, నిల్వ, విక్రయాలను ఏడాది పాటు నిషేధించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. 2025 మే 15వ తేదీ వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

వివిధ జిల్లాల నుంచి సేకరించిన పీచు మిఠాయి నమూనాలను పరీక్షించిన ఆహార భద్రత అధికారులు వీటిలో ప్రమాదకరమైన రంగులు కలుపుతున్నట్లు గుర్తించారు. ఇవి ఆహార భద్రత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై ఇవి దుష్ప్రభావం చూపుతాయని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వీటి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలు తీసుకునే ఆహారంపై కాస్త శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా ఆహార భద్రత అధికారులు తెలిపారు. మార్కెట్లో హానికరమైన పదార్థాలు చాలా లభ్యమవుతున్నాయని, ప్రభుత్వాలు కట్టడి చేస్తున్నా కొంత వరకు పిల్లలు వాటి బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version