మోడీ అబద్ధాలు చెబుతున్నారు – సిపిఐ నారాయణ

-

ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానిగా రాష్ట్రాల సమస్యలు పరిష్కరిస్తారని అనుకున్నామని.. కానీ అది రాష్ట్రాల అభివృద్ధి పర్యటన కాదు..దురుద్ధేశ్య పర్యటన అంటూ ఆరోపించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సంవత్సరం నుండి పని చేస్తూనే ఉందన్నారు.

తెలంగాణ లో పార్టీ అభివృద్ధి చేసుకోవడమే పనిగా ఇక్కడ పర్యటించారని దుయ్యబట్టారు నారాయణ. 24 నియోజకవర్గల్లో సింగరేణి విస్తరించి ఉందని.. రామగుండం సభలో సింగరేణి ప్రైవేట్ చేయడం లేదని మోడీ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వంది ఉంది కానీ.. 2015 లో ఆ చట్టాన్ని మార్చారని తెలిపారు. 240 మైన్స్ లో 95 మైన్స్ ప్రయివేటు వాళ్ళకిచ్చారని అన్నారు.

డెక్కన్ వాళ్ళ నుండి తీసుకున్నప్పుడు ప్రయివేటు వాళ్ళకి ఇవ్వొద్దని ఒప్పందం ఉందని.. 4 మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి కమర్షియల్ మైన్స్ కి ఇస్తూ నోటిఫికేషన్ ఇచ్చారని వెల్లడించారు. ఇలా రాబోయే రోజుల్లో ప్రైవేటు పరం చేసే ప్లాన్ చేశారని ఆరోపించారు నారాయణ. దేశవ్యాప్తంగా కోల్ ఇండియా ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని అన్నారు. లక్షా 40 వేల మంది ఉద్యోగులు ఉండే సింగరేణి లో ఇప్పుడు 40 వేల మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. సింగరేణిని అంబానీ,ఆదాని లాంటి కార్పోరేట్ కంపెనీలకు అప్పగిస్తారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version