డబ్బింగ్ సినిమాలకు రిలీజ్ చేయవద్దు..దిల్ రాజ్ కు వార్నింగ్ !

-

డబ్బింగ్ సినిమాలపై దిల్ రాజ్ కు ఊహించని షాక్‌ తగిలింది. డబ్బింగ్ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయవద్దని దిల్ రాజ్ కు ఓ లేఖ ద్వారా గుర్తు చేసింది తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేసింది. తెలుగు చలన చిత్రాల పెరిగిన నిర్మాణ వ్యయము దృష్టిలో పెట్టుకొని మరియు నిర్మాత శ్రేయస్సు కోరి తెలుగు సినిమాని కాపాడుకుందాం అనే లక్ష్యంతో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ది: 08-12-2017 తేదీన న జరిగిన అత్యవసర మీటింగులో, “సంక్రాంతి, దసరా పండుగలకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది”అని ఈ లేఖలో పేర్కొన్నారు.

ఈ విషయమై, ప్రముఖ నిర్మాత మరియు ఛాంబర్ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ శ్రీ దిల్ రాజు గారు 2019 సంవత్సరంలో మీడియా | ద్వారా స్ట్రెయిట్ సినిమాలు ఉండగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తాం అని ఘాటుగా వ్యాఖ్యలు చేసి ఆ ప్రకారమే స్ట్రెయిట్ సినిమాలకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వాటిని డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయాన్ని విధిగా అమలుపర్చాలని తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడుకుంటూ స్ట్రెయిట్ గా తీసిన తెలుగు చిత్రాలకు ప్రధమ ప్రాధ్యానత ఇస్తూ మిగిలిన వాటిని మాత్రమే డబ్బింగ్ సినిమాలకు “సంక్రాతి, దసరా పండుగలలో” కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సినిమా ఎక్సిబిటర్స్’ ను (ప్రదర్శకులు) కోరుచున్నామని లేఖ విడుదల చేశారు. ఈ లేఖపై దిల్‌ రాజ్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version