ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే మోడీ తెలంగాణ పర్యటన : రేవంత్ రెడ్డి

-

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనతో ప్రజలకు నిరాశనే మిగిలిందని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఏదో కొత్త హామీలు అన్నట్టు మాట్లాడారని.. మోడీ చేసిన మోసానికి కిషన్ రెడ్డి క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోడీతో సభ నిర్వహించడం అనైతికమన్నారు. విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్, రాజ్ గోపాల్ రెడ్డి అందుకే రాలేదనే చర్చ కొనసాగుతుంది. మోడీ పర్యటన ఖర్చు కూడా పాలమూరుకు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు మోడీ తెలంగాణ పర్యటనకి వచ్చారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను ఓడించేందుకు ఇద్దరూ ఏకమైన చేస్తున్న పర్యటనలు ఇవి అన్నారు. 2004, 2009లో కాంగ్రెస్ మేనిఫెస్టో తో నేను.. 2014, 2018 మేనిఫెస్టో తో చర్చకు వస్తారా ? రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version