నిజామాబాద్ ఎంపీగా ప్రధాని మోడీ పోటీ చేయాలని కోరారు బీజేపీ ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అడివి మామిడిపల్లి, ఆర్మూర్ పట్టణంలోని రైల్వే ఆర్ఓబి నిర్మాణ పనులను పరిశీలించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణ పనులను గడువు లోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు ఎంపీ అరవింద్.
ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అరవింద్ మాట్లాడుతూ…. ఆర్ఓబి పనుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేసిన 15 కోట్లను నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసి ఎన్నికల్లో ఖర్చు చేసిందని ఆగ్రహించారు. అడవి మామిడిపల్లి ఆర్వోబి పనుల కోసం డిపాజిట్ చేసిన 15 కోట్లు అప్పటి ప్రభుత్వం ఇతర అవసరాలకు ఉపయోగించినట్లు అధికారులు ఒప్పుకున్నట్లు తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తామని ప్రకటించారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రధాని మోడీ పోటీ చేస్తే ఆహ్వానిస్తానన్నారు.