ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ పార్టీకి మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం కు తీవ్ర అస్వస్థత నెలపొంది. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ముద్రగడ పద్మనాభం ను.. తాజాగా కాకినాడలోని అహోబిల ఆసుపత్రిలో రెండు రోజుల కిందట చేర్చడం జరిగింది.

అయితే… షుగర్ లెవెల్స్ పడిపోయి ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. దీంతో వెంటనే ముద్రగడ పద్మనాభం ను హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలోని ముద్రగడ పద్మనాభం కు వైద్యం అందిస్తున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేశారు. అటు ముద్రగడను చూసేందుకు వైసిపి నేతలు హైదరాబాద్ చేరుకుంటున్నారు.