Get Ready : నేడు BRS మేనిఫెస్టో విడుదల.. మహిళలకు పెద్దపీట !

-

BRS మ్యానిఫెస్టో విడుదలకు ముహర్తం ఫిక్స్‌ అయింది. ఇవాళ మధ్యాహ్నం 12:15 గంటలకు బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే..ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకుంటారు. ఈ సందర్భంగా అభ్యర్థులు, నియోజకవర్గాల ఇంఛార్జిలతో సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌.

Muhartam fix for release of BRS Manifesto

అనంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్‌ కేసీఆర్‌. ఆ తరువాత అభ్యర్థులకు బి ఫారాలు అందచేయనున్నారు కేసీఆర్. తదనంతరం BRS మ్యానిఫెస్టో విడుదల చేస్తారు సీఎం కేసీఆర్. BRS మేనిఫెస్టోలో.. మహిళలకు పెద్దపీట వేసే ఛాన్స్ ఉంది.  ఇక ఆ తర్వాత ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో హుస్నాబాద్ బయలుదేరుతారు. ఈ సందర్భంగా హుస్నాబాద్‌ లో మొదటి ఎన్నికల ప్రచార సభ లో పాల్గొననున్న కేసీఆర్… అనంతరం ప్రగతి భవన్‌ కు తిరిగి వస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version