సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముస్లిం పెద్దలు

-

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ముస్లిం పెద్దలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సచివాలయంలో మైనారిటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, వివిధ జిల్లాల మైనారిటీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Muslim elders who met CM Revanth Reddy

మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలని, మైనారిటీ పాఠశాలల అభివృద్ధికి తగిన బడ్జెట్ కేటాయించాలని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వక్ఫ్ భూములను కాపాడటంతో పాటు శాంతి, భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని కోరారు. మైనారిటీల సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత తనదేనని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సీఎం హామీపట్ల మైనారిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version