జనగామ ఎమ్మెల్యే టికెట్ నాదేనంటూ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వెల్లడించారు. జనగామ జిల్లాలో బీసీ బందు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
జనగామ ఎమ్మెల్యే టికెట్ నాదేనన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. టికెట్ పై సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి చెప్పారంటూ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ గెలిచే నియోజకవర్గాలలో జనగామ టాప్ లో ఉందన్నారు. చిల్లర రాజకీయాలను భయపడనంటూ స్పష్టం చేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. కాగా, గత కొన్ని రోజులుగా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కూతురు మధ్య ఓ భూమి వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.