ఇళయరాజా బయోపిక్​లో స్టార్ హీరో.. భలే ఛాన్స్ కొట్టేశాడుగా

-

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఓ క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడట. అయితే ఆ ప్రాజెక్టు ఓ బయోపిక్ అంట. అలాంటిలాంటి బయోపిక్ కాదు మరి. మ్యూజిక్ మేస్ట్రో.. సంగీత ప్రపంచానికి రారాజు.. ఇళయరాజా బయోపిక్​లో ధనుష్ కనిపించబోతున్నాడట. ఇప్పటి వరకు 1400 చిత్రాలకు పైగా పనిచేసి ఇళయరాజా బయోగ్రఫీ ఇప్పుడు తెరపైన ఆవిష్కృతం కాబోతోంది. ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడికి ఈ ఆలోచన వచ్చింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే..?

బీ టౌన్ డైరెక్టర్ బాల్కీ.. ఇళయారాజా బయోపిక్​ తీయాలనుకుంటున్నారట. ఈ ప్రాజెక్టు తన డ్రీమ్​ అని.. ఇళయరాజాగా ధనుష్​ను చూడాలనుకుంటున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాల్కీ చెప్పారు. అయితే ధనుష్‌ కూడా గతంలో ఇళయరాజా బయోపిక్​లో నటించాలనుందని చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో నటించేందుకు ధనుష్ కూడా ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డైరెక్టర్​ బాల్కీ.. ఇప్పటికే హీరో ధనుష్‌తో ‘షమితాబ్‌’ సినిమా తీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version